అహ్మదాబాద్ : గుజరాత్లోని ఓ ఫ్యాక్టరీ దాదాపు ఐదేండ్లుగా కల్తీ (సింథటిక్) పాలను తయారు చూస్తూ అమ్ముకుంటున్నది. నిజమైన పాలకు బదులుగా రసాయన మిశ్రమాన్ని (యూరియా, డిటర్జెంట్) ఉపయోగించి రహస్యంగా సింథటిక్ పాలను తయారుచేస్తున్న సంగతి అధికారుల సోదాల్లో బయటపడింది.
సబర్కాంత జిల్లాలోని ఓ ఫ్యాక్టరీపై ఆదివారం ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు జరిపిన దాడుల్లో ఈ సంగతి వెలుగుచూసింది. దీంతో ఈ ఫ్యాక్టరీ తయారుచేసిన కల్తీ పాలను వాడిన వినియోగదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. తక్కువ మొత్తంలో నిజమైన పాలను వాడుతూ యూరియా, ప్రాసెస్ చేసిన పౌడర్లను కలుపుతున్నట్టు అధికారులు కనుగొన్నారు. రసాయానాలను, పౌడర్లను జోడించటం ద్వారా ప్రతిరోజూ దాదాపు 1,800 లీటర్ల కల్తీ పాలను ఉత్పత్తి చేశారని అధికారులు తెలిపారు.