లా నూసియా (స్పెయిన్) : బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత బాక్సర్లు పసిడి పంచ్ విసిరారు. ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్లలో ఏకంగా 9 స్వర్ణాలు సాధించి సత్తాచాటారు.
ఫైనల్లో స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు)తో పాటు ప్రియా (60 కి.), అరుంధతి (70 కి.), మంజు రాణి (48 కి.), నీతూ (51 కి.), పూనమ్ (54 కి.), నైనా (80 కి.) తమ ప్రత్యర్థులను చిత్తుచేసి పసిడి పతకాలు సాధించారు. పురుషుల ఫైనల్స్లో సచిన్ (60 కి.), ఆకాశ్ (75 కి.) కూడా గోల్డ్ మెడల్స్ గెలిచారు.