హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా భట్నవిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అకడికకడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను నవీన్ (22), జతిన్(26), నల్లి నవీన్ (27), అజయ్(18)గా పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురు మామిడికుదురు మండలం నగరం గ్రామ వాసులుగా, మరొకరు పీ గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వారని చెప్పారు. యానాంలో పుట్టినరోజు వేడుకలు చేసుకుని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు దవాఖానకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.