Reliance | ముంబై, నవంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అత్యధికంగా అమ్మకాలు జరగడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా సాగనున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు చైనా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశాలుంటడంతో దలాల్‌స్ట్రీట్ వర్గాల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా సంవత్ 2081కు ఆరంభరోజు లాభపడిన సూచీలు ఆ మరుసటి రోజే భారీ నష్టాలను మూటగట్టుకున్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలకు ఆజ్యంపోశాయి. దీంతో ఒక దశలో 1,500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 941.88 పాయింట్లు(1.18 శాతం) నష్టపోయి 78 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 78,7812.24 వద్ద స్థిరపడింది.
ఆగస్టు 6 తర్వాత సూచీకి ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. మరో సూచీ నిఫ్టీ ఒక్క శాతానికి పైగా నష్టపోయింది. ఇంట్రాడేలో 488 పాయింట్లు నష్టపోయిన సూచీ చివరకు 309 పాయింట్లు(1.27 శాతం) కోల్పోయి 23,995.35 స్థాయికి జారుకున్నది. స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో మదుపరులు ఆరు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.5,99,539.5 కోట్లు కరిగిపోయి రూ.4,42,11,068 కోట్లు(5.26 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చిత పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటం, చైనా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ల నిరుత్సాహ ఫలితాలు, ఈవారంలోనే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశాలుండటం కూడా మదుపరుల్లో ఆందోళనను పెంచింది.
ఆర్ఐఎల్ షేరు 3% డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కుప్పకూలింది. ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా నష్టపోయిన కంపెనీ షేరు ధర చివరకు 2.77 శాతం నష్టపోయి రూ.1,302 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ 2.72 శాతం తగ్గి రూ.1,302.15 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.50,205.1 కోట్లు కరిగిపోయి రూ.17,61,914. 95 కోట్ల వద్దకు జారుకున్నది.
పతనానికి కారణాలు