కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబుతున్నా కూడా ఏదో తెలియని కంగారు అయితే అభిమానుల్లో కనబడుతుంది. ఈ క్రమంలోనే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాస్పిటల్‌కి వెళ్లి సాయి ధరమ్ తేజ్‌ను చూసి బయటకు వచ్చి మీడియాతో ఆయన బాగున్నాడని.. తప్పకుండా కోలుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగే ముందు సాయిధరమ్ తేజ్ ఎక్కడికి వెళ్లి వస్తున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేశ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
ప్రమాదం జరిగడానికి ముందు తన కొడుకు నవీన్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ ఓపెనింగ్‌కి వెళ్లాడని చెప్పాడు నరేశ్. తమ ఇంటి నుంచే బయల్దేరిన సాయి ధరమ్ తేజ్ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందని.. త్వరలోనే మళ్లీ కోలుకొని వస్తాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిన సమయంలో ఇలాంటి రిస్కులు ఎవరు తీసుకోవద్దని ఆయన కోరాడు. సెలబ్రిటీలు బైక్స్ నడపడం పూర్తిగా ఆపేయాలంటూ సూచించాడు. అంతేకాదు తన కొడుకుతో పాటు సాయిధరమ్ తేజ్ దగ్గర కూడా 1000 సీసీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని.. అలాంటి వాటిని రోడ్డు మీదకి తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు ఈయన. తన కొడుకుతో పాటు తేజ్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని.. బైక్స్ నడిపేటప్పుడు వాళ్లు అన్ని సేఫ్టీ మెజర్స్ వాడిన తర్వాత బయటికి వస్తారని అంటున్నాడు సీనియర్ నరేశ్.
తన కొడుకు, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులని.. తేజూ కూడా తనకు కొడుకు లాంటి వాడే అంటున్నాడు ఈయన. 1000cc అంతకంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్స్‌ను మన దగ్గర గవర్నమెంట్ బ్యాన్ చేయాలని సూచిస్తున్నాడు నరేశ్. తాను కూడా ఒకప్పుడు బైకర్ అని.. అయితే ఒకసారి ప్రమాదానికి గురైన తర్వాత తన తల్లి ఇంకోసారి బైక్ నడపొద్దని తన దగ్గర ఒట్టు వేయించుకున్నట్లు గుర్తు తీసుకున్నాడు నరేశ్. తాను నవీన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కు కూడా చాలా సార్లు బైక్ వాడొద్దని హెచ్చరించానని .. అయినా కూడా వాళ్లు వినలేదని అంటున్నాడు. వాళ్లకు ఏదో బైక్ స్పోర్ట్స్ క్లబ్ ఉందని.. అక్కడ రేసులు కూడా చేస్తారు అంటూ ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు నరేశ్. ఏదేమైనా ఇంత పెద్ద బైక్స్ ను మన గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నాడు నరేశ్. లేదంటే ఏదైనా ఒక సీసీ దగ్గర ఆపేయాలని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Health Bulletin: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్.. !
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Sai dharam Tej: ప్రమాదం సమయంలో సాయి తేజ్ వాడిన బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?