హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయ న సాదాసీదాగా బాధ్యతలు తీసుకున్నారు.
అనంతరం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1991వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్(డీజీ) హోదాలో కొనసాగుతున్నారు.