హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్పీడ్ పోస్ట్ చార్జీలను తపాలా శాఖ సవరించింది. సేవలను మెరుగుపర్చడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, కొత్త విధానాలు అమలు చేయడం తదితర కారణాల వల్ల చార్జీలను సవరించినట్టు తెలిపింది. కొత్త ధరలు నేటి (బుధవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ తపాలా సేవల సహాయక సంచాలకులు డీ నేమతుల్లా తెలిపారు.
పార్శిల్ బరువు, దూరాన్నిబట్టి చార్జీలు పెరుగుతూ ఉంటాయని, దీనిపై అదనంగా జీఎస్టీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.