ఉట్నూర్ : జిల్లాలోని బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ( Best available schools ) గిరిజన విద్యార్థుల ( Tribal Students ) ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఉట్నూర్ ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన లక్కీ లాటరీలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ( ITDA PO) ఖుష్బూ గుప్త విద్యార్థుల ఎంపిక లాటరీ నిర్వహించే విధానాన్ని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం తరగతులు వారిగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.
8వ తరగతిలో 12 సీట్లకు గాను 88 దరఖాస్తులు, 5వతరగతిలో 12 సీట్ల కోసం 270దరఖాస్తులు వచ్చాయి. 3వతరగతిలో 24 సీట్లకు గాను 244 దరఖాస్తులు అందాయి. గిరిజన తెగల ఆధారంగా ప్రకటించిన సీట్లకు అనుగుణంగా విద్యార్థులు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశం పొందుతారని ఐటీడీఏ పీవో తెలిపారు.
ఎంపికైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏపీవో పీవీటిజీ మెస్రం మనోహర్, ఏటీడీవో క్రాంతి, జిల్లా గిరిజన క్రీడాల అధికారి పార్థసారథి, జీసీడీవో ఓ ఛాయా, ఎంఎల్ఐటీ దేవరావు, ఏవో వేణుమాధవ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.