జహీరాబాద్ ఫిబ్రవరి 3 : అక్రమంగా తరలిస్తున్న 270 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిరాక్ పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి శివారులో 65వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా..హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా 270 కింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
లారీ డ్రైవర్ ఉత్తరప్రదేశ్‌లోని రాజాపూర్ కు చెందిన అఖిలేష్ యాదవ్‌గా గుర్తించామని పేర్కొన్నారు. లారీ డ్రైవర్ తో పాటు లారీ యజమాని పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని జహీరాబాద్ పట్టణంలో ఉన్న గోదాంలో నిల్వ చేశామని ఎస్ఐ తెలిపారు.