– నల్లగొండ 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్
నీలగిరి, ఫిబ్రవరి 07 : నల్లగొండ పట్టణంలోని సావర్కర్ నగర్లో తన భర్త కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్దిని చూసి తనను ఆశీర్వదించాలని 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్ ఓటర్లను కోరారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సావర్కర్‌నగర్, వైకుంఠనగర్ కాలనీలో అమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా పది సంవత్సరాలు పనిచేసిన అధికార పార్టీ అభ్యర్థి చేసిందేమిటని ప్రశ్నించారు. తన భర్త వేసిన రోడ్లు తప్ప ఆమె కొత్తగా చేసిందేమి లేదన్నారు. వర్షం పడితే సావర్కర్ నగర్ ఎక్కడికక్కడ నీటితో మురికికుంటగా ఉంటుందన్నారు. దాన్ని డైవర్షన్ చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కుటుంబ సభ్యులుగా ఉన్న తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో ఆమె వెంట మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్, మునాస సాయి, నూకల అశోక్, ఎండీ ఆయూబ్, ముంత ప్రశాంత్, సిగరంమెట్ల ప్రవీణ్, ముంత శ్రీను, బారీ మధు ఉన్నారు.