అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
నల్లగొండ పట్టణంలోని సావర్కర్ నగర్లో తన భర్త కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్దిని చూసి తనను ఆశీర్వదించాలని 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్ ఓటర్లను కోరారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సావర్కర్‌నగర్, వైకుంఠనగర్ కాలనీలో..
– నల్లగొండ 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్
నీలగిరి, ఫిబ్రవరి 07 : నల్లగొండ పట్టణంలోని సావర్కర్ నగర్లో తన భర్త కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్దిని చూసి తనను ఆశీర్వదించాలని 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్ ఓటర్లను కోరారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సావర్కర్‌నగర్, వైకుంఠనగర్ కాలనీలో అమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా పది సంవత్సరాలు పనిచేసిన అధికార పార్టీ అభ్యర్థి చేసిందేమిటని ప్రశ్నించారు. తన భర్త వేసిన రోడ్లు తప్ప ఆమె కొత్తగా చేసిందేమి లేదన్నారు. వర్షం పడితే సావర్కర్ నగర్ ఎక్కడికక్కడ నీటితో మురికికుంటగా ఉంటుందన్నారు. దాన్ని డైవర్షన్ చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కుటుంబ సభ్యులుగా ఉన్న తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో ఆమె వెంట మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్, మునాస సాయి, నూకల అశోక్, ఎండీ ఆయూబ్, ముంత ప్రశాంత్, సిగరంమెట్ల ప్రవీణ్, ముంత శ్రీను, బారీ మధు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

