వాడిపోయిన ‘కమలం’ పార్టీ.. రెండు విడతల పంచాయతీల్లో పట్టుకోల్పోయిన కాషాయ దళం
పంచాయతీ పోరులో కమలం వాడిపోయింది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీకి పల్లెల్లో పట్టులేదని తేలిపోయింది.
- 3911 స్థానాల్లో గెలిచింది 6.5%
- కేవలం 236 స్థానాల్లోనే విజయం
- అదీ రెండు, మూడు జిల్లాల్లోనే
- ఇతరుల కంటే తక్కువ స్థానాలతో ఘోరపరాభవం
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పోరులో (Panchayathi Elections) కమలం (BJP) వాడిపోయింది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీకి పల్లెల్లో పట్టులేదని తేలిపోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతం త్ర అభ్యర్థులు గెలిచిన సీట్లలో కనీసం సగం కూడా సాధించలేక ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్నది. తొలి విడతలో దారుణంగా ఓటమిపాలై కేవలం 189 పంచాయతీల్లో గెలుపొందిన బీజేపీకి రెండో విడతలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో విడతలో ఎన్నికలు జరిగిన 3,911 స్థానాల్లో కేవలం 236 స్థానాల్లో (6.5 శాతం) మాత్రమే బీజేపీ మద్దతుదారులు విజయం సాధించగలిగారు.
ఆదిలాబాద్, మంచిర్యాల మినహా మిగిలిన ఏ జిల్లాలోనూ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. రెండు విడతల్లో ఆ పార్టీ కేవలం 435 స్థానాలతో సరిపెట్టుకున్నది. రెండు విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు 1,161 స్థానాల్లో గెలుపొందారు. అందు లో సగం కూడా బీజేపీకి రాకపోవడం కమలనాథుల దయనీయస్థితికి అద్దంపడుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గమైన కరీంనగర్‌తోపాటు ఎంపీ ఈటల గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్‌లోనూ బీజేపీ మద్దతుదారులు ఓటమిపాలవడం చర్చనీయాంశమైంది. మరో ఎంపీ రఘునందన్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్‌లో కనీసపోటీ ఇవ్వకపోవడంతో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకమైంది.
మాటల్లోనే ‘ప్రత్యామ్నాయం’
బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రత్యామ్నాయం తామేనని ఊదరగొట్టే బీజేపీ రాష్ట్ర నేతల మాటలు వట్టివేనని రెండు విడతల పం చాయతీ ఎన్నికల ఫలితాలతో రూఢీ అయిం ది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 30 శాతానికిపైగా ఓట్లు సాధించడం, 8 సీట్లలో గెలుపొందడం గాలివాటమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మున్ముందు తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమేని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని, ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని, అందుకు స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

