హైదరాబాద్, జనవరి 22: సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఐపీవోకి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.425 కోట్ల ఐపీవోలో తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.285 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.140 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ యోచిస్తున్నది.
వచ్చే నెల మూడో వారంలో ఈ విక్రయాన్ని ప్రారంభించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.