ముంబై, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా మూడు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్ విషయంలో సయోధ్యకు మొగ్గుచూపుతున్నట్టు, అలాగే త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకానున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఒక దశలో 900 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 397.74 పాయింట్లు అందుకొని 82,307. 37 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 132.40 పాయింట్లు అందుకొని 25,289.90 వద్ద నిలిచింది. దీంతో మదుపరుల సంపద రూ.6.6 లక్షల కోట్ల మేర పెరిగింది. భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.