హైదరాబాద్, ఆట ప్రతినిధి: లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల అడ్వాన్స్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో రాష్ట్ర యువ స్కేటర్ పడిగె తేజేశ్ రజత పతకంతో మెరిశాడు.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ తేజేశ్ రెండో స్థానంలో నిలిచాడు. రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన తేజేశ్ వెండి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.