రామగిరి, అక్టోబర్ 12 : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి విద్యా సంస్ధలకు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 14వరకు సెలవులు రావడంతో విద్యార్థుల సంతోషానికి అవధుల్లేవు. హాస్టళ్లలో ఉండే పిల్లలు మంగళవారం సాయంత్రమే ఇంటిబాట పట్టగా, బస్టాండ్లు కిటకిటలాడాయి. ఈ నెల 2 నుంచి అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
2 నుంచి 14వరకు పాఠశాల విద్యాశాఖ సెలవులు ఇవ్వగా, ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం ఈ నెల 6నుంచి 13వరకు ఇచ్చింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, వాటి అనుబంధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలకు ఈనెల 3 నుంచి 13వరకు సెలవులను ప్రకటించారు. పాఠశాలలు ఈ నెల 22న తిరిగి పునఃప్రారంభం కానున్నాయి.