రుణ మారిటోరియంపై నేడు సుప్రీం రూలింగ్!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో రుణాల వసూళ్లపై మారటోరియం పొడిగింపు, రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయనున్నదని తెలుస్తున్నది. గతేడాది (2020) భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విధించిన మారటోరియం గత ఆగస్టుతో ముగిసింది. అయితే, బ్యాంకులు మరికొన్ని ఖాతాలను మొండి బకాయిలుగా ప్రకటించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్బీఐ నిరాకరించాయి.
ఎమర్జెన్సీలో మారటోరియానికి విధి విధానాలు..
ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రుణ వడ్డీ మాఫీతోపాటు రుణ వసూళ్లపై మారటోరియం విధించడానికి విధి విధానాలను సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మహమ్మారులు వెలుగుచూసినప్పుడు ఆర్థిక రంగానికి తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సుప్రీంకోర్టు స్పందించొచ్చు. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేసింది.
భారీ మారటోరియం కోసం విద్యుత్ సంస్థలు, ఎంఎస్ఎంఈలు
విద్యుత్ ఉత్పత్తిదారులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు దీర్ఘకాలికంగా మారటోరియం ప్రకటించాలని కోరుతున్నాయి. మహమ్మారి ప్రభావం తగ్గించడానికి ఆర్థిక సాయం అందజేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే భారీ రుణ గ్రహీతలకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కామత్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం వ్యతిరేకించింది. అయితే, క్రెడిట్ కార్డు యూజర్లపై వడ్డీ మాఫీకి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
ఐపీఎల్ 2021 ‘క్వారంటైన్’ సాంగ్ విడుదల
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- loans
- maratorium
- rbi
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

