అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!

ముంబై: కరోనా మహమ్మారి ఒక సంవత్సరం పాటు విజృంభించడంతో దేశంలో పలు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వారి దాచి పెట్టుకున్న సేవింగ్స్ ఖర్చయి పోయాయని తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రజలు.. కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు దేశ జీడీపీలో 37.1 శాతానికి చేరాయని ఆ నివేదిక వెల్లడించింది.
2019-20తో పోలిస్తే పొదుపు 10.4 శాతం తగ్గినట్లు తెలిపాయి. కరోనా మహమ్మారి వల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, పలు సంస్థలు తమ ఉద్యోగుల శాలరీల్లో భారీగా కోతలు విధించాయి. దీంతో సాధారణ ప్రజానీకం తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అప్పులు చేయడం గానీ, ఇంతకుముందు పొదుపు చేసిన సొమ్మును గానీ వాడుకున్నారని ఆర్బీఐ వెల్లడించింది.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 21 శాతానికి పెరిగింది. కానీ మహమ్మారి ప్రభావం దీర్ఘకాలం కొనసాగి ఆదాయాలు పడిపోవడంతో ఆయా కుటుంబాలు పొదుపు చేసిన మొత్తాలను వాడుకున్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 10.4 శాతానికి తగ్గింది. గత డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో పొదుపు మరింత పడిపోయే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అన్నాడీఎంకే ఒక్క సీటు గెలిచినా అది బీజేపీ విజయమే: స్టాలిన్
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
ఉద్యోగం మారినా పీఎఫ్ నంబర్ ఒకటే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

