న్యూఢిల్లీ, నవంబర్ 22: ఎస్బీఐ ఆర్థిక వేత్తల నివేదిక వ్యవసాయ రంగానికి సంబంధించి 5 సంస్కరణలను ప్రతిపాదించింది. అవి… 1. రైతులు డిమాండ్ చేస్తున్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు హామీ’కి బదులు కేంద్రం కనీసం ఐదేండ్ల కాలానికి ‘క్వాంటిటీ గ్యారంటీ క్లాజ్’ను తీసుకురావాలి. దీని ప్రకారం పంట సేకరణకు భరోసా ఇవ్వాలి. 2. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్లో) వేలం ఫ్లోర్ ధరగా ఎంఎస్పీని మార్చాలి. 3. వ్యవసాయ మార్కెట్లో మౌలిక వసతులను బలోపేతం చేయాలి. 4. కాంట్రాక్ట్ వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేయాలి. 5. రాష్ర్టాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సమానంగా ఉండాలి. ఉదాహరణకు పంజాబ్, హర్యానాల్లో ధాన్యాన్ని 83 శాతం సేకరిస్తుంటే కొన్ని రాష్ర్టాల్లో అది 10 శాతం కూడా ఉండటం లేదు.