తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో అగ్ర హీరో ప్రభాస్ భాగమయ్యారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. మనల్ని ఎంతగానో ప్రేమించే మనుషులు ఉండగా..డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తన సోషల్‌మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. ‘లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బ్రతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టూ డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్లెవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.