Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia), హౌతీ తిరుగుబాటుదారుల (Hauthi Rebels) మధ్య దాడులతో పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. సౌదీలోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలను హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తుండటంతో సంపన్న దేశం తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూస్తున్నది.
Saudi Arabia : సౌదీ అరేబియా (Saudi Arabia), హౌతీ తిరుగుబాటుదారుల (Hauthi Rebels) మధ్య దాడులతో పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. సౌదీలోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలను హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తుండటంతో సంపన్న దేశం తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూస్తున్నది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ట్యాంకర్లపై ఇరాన్ చేస్తున్న దాడులవల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులకు కూడా అంతరాయం కలుగుతున్నది.
దేశంలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు హూతీలతో రాజీకొచ్చారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుదారులకు ఓ ఆఫర్ ఇచ్చారు. హౌతీలు తమ దేశంపై దాడులను పూర్తిగా ఆపితే 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు) ఇస్తామని సౌదీ యువరాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని ఇరాన్ ద్వారానే హూతీలకు అందించే అవకాశం ఉంది.
ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఒప్పందం కోసమే ఇటీవల సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ టెహ్రాన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆయన వచ్చిన సైనిక రవాణా విమానంలోనే హౌతీలకు ఇవ్వదలిచిన మొత్తం డబ్బును తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయాన్ని సౌదీ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చల్లో టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐఆర్జీసీ సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు తెలిసింది.
గతంలో హూతీలు యెమెన్ సర్కారుతో పోరాడుతున్న సందర్భంలో వ్యతిరేకంగా సౌదీ అరేబియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే సౌదీ వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

