Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Cyclone Arnab | తీరానికి చేరువైన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు బీచ్‌లను అధికారులు మూసివేశారు. విశాఖపట్నం సహా పలు తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు
Cyclone Arnab : తీరానికి చేరువైన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు బీచ్‌లను అధికారులు మూసివేశారు. విశాఖపట్నం సహా పలు తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. విశాఖలోని రుషికొండ, ఆర్కేబీచ్లతోపాటు బాపట్ల జిల్లాలో చీరాల, ఓడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు విశాఖ సందర్శనకు రావద్దని అధికారులు సూచించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు బీచ్‌లలో ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. తుపాను ప్రభావం కారణంగా అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపలవేటను నిలిపివేశారు. బోట్లను ఒడ్డుకు చేర్చారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ జెట్టీ, కొత్తపాలెం, నక్షత్రనగర్, లంకెవానిదిబ్బ, పెనుమూడిలో బోట్లను ఒడ్డుకు తీసుకొచ్చారు.
కాకినాడ జిల్లాలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాకినాడ కలెక్టరేట్లో 0884-2356801, 98499 03879 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక తుపాను ఎఫెక్ట్‌తో విశాఖపట్నంలో ఇప్పటికే ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని మహారాణిపేట అంగడిదిబ్బ వద్ద చెట్టు విరిగిపడి పాన్ షాపు ధ్వంసమైంది. ఈ క్రమంలో సహాయక చర్యలకు విద్యుత్‌శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశించారు.
అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలకు సామగ్రి, యంత్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నంబర్‌ను సంప్రదించాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | హంతకుడిని పట్టించిన బంగారు ఉంగరం.. ఎలాగంటే..!
Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

