Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Hyderabad | హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలు కలకలం రేపాయి. బ్లాస్టింగ్ జరిగినట్లు వినిపించిన ఈ శబ్దాలతో పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, ఎర్రగడ్డ, లంగర్‌హౌస్, కేశవస్వామి నగర్‌తో పాటు రాజేంద్రనగర్ పరిసరాల్లో ఈ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
Hyderabad | హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలు కలకలం రేపాయి. బ్లాస్టింగ్ జరిగినట్లు వినిపించిన ఈ శబ్దాలతో పలు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, ఎర్రగడ్డ, లంగర్‌హౌస్, కేశవస్వామి నగర్‌తో పాటు రాజేంద్రనగర్ పరిసరాల్లో ఈ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అనిపించిందని పేర్కొన్నారు. దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై చర్చ మొదలైంది.
ఒకేసారి పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు
మంగళవారం ఉదయం సుమారు 9.15 గంటల సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు సంభవించిందా? భూకంపం వచ్చిందా? అనే సందేహాలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించిందని కొందరు స్థానికులు వెల్లడించారు. అయితే ఈ శబ్దాలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఒకేసారి పలు ప్రాంతాల్లో శబ్దాలు వినిపించడం, భూమి కంపించినట్లు స్థానికులు చెప్పడంతో భూకంపం వచ్చిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటన భూకంపం వల్లే జరిగిందని నిర్ధారించే అధికారిక సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. అలాగే భూగర్భ ప్రక్రియలు లేదా ఇతర కారణాల వల్లే ఈ శబ్దాలు వచ్చాయని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కాగా భారీ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

