మహబూబాబాద్ : సోయిలేని పరిపాలనపై అవగాహన లేని ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం మన దురదృష్టకరమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా
నరసింహులపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ గోదం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి నిరీక్షిస్తుండగా రైతులతో మాట్లాడారు. రైతులకు యూరియా కొరత రావడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఎన్నడు రైతులకు ఎరువుల కొరత రాలేదన్నారు.రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత బీఆర్ఎస్కే దక్కుతందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపట్ల ఏమాత్రం సోయిలేదని మండిపడ్డారు. వెంటనే రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేయకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.