సత్తుపల్లి టౌన్, నవంబర్ 29: ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ, పట్టణ పేదలకూ వైద్య సేవలను చేరువ చేస్తోందని అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూడు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి అని గుర్తుచేశారు.
40 ఏళ్ల క్రితం నిర్మించిన సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు ఆసుపత్రుల సమస్యలను ఇటీవలి పర్యటనలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన వెంటనే స్పందించి ఈ మూడు ఆసుపత్రుల వద్ద నూతన భవనాల నిర్మాణానికి రూ.57 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. త్వరలోనే పెనుబల్లి, కల్లూరు ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అభివృద్ధి విషయంలో సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా ఉందన్నారు. 22 పల్లె దవాఖానలకు గాను ఇప్పటికే 18 దవాఖానలకు వైద్యులను నియమించినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సీతారామ్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, తోట సుజలారాణి, అనీషా, మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, యాగంటి శ్రీను, రఫీ, సురేశ్ పాల్గొన్నారు.
పట్టణంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన పేదలకు సీఎం సహాయ నిధి భరోసానిస్తోందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొందరిని పలుకరించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు రఫీ, మల్లూరు అంకమరాజు, కంటే నాగలక్ష్మి, అప్పారావు, రజిత, ముదిగొండ రామారావు, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, యాకోబు, యాసా రాంబాబు, రామకృష్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.