ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీకి చెందిన పలువురు సర్పంచులు మండల పరిషత్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.
ఊట్కూర్, నవంబర్ 18: ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీకి చెందిన పలువురు సర్పంచులు మండల పరిషత్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో పావని అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన అనేక మంది పేదలకు ఇళ్లు మంజూరు కాలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరాలని భావించినట్లు తెలిపారు.
అయితే గత రెండు సమావేశాలకు మంత్రి హాజరుకాలేదని, ఈసారైనా వస్తారని ఆశించామని పేర్కొన్నారు. కానీ ఈ సమావేశానికీ మంత్రి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి నినాదాలు చేశారు. నిరసన తెలిపిన వారిలో సర్పంచులు రేణుక భరత్, కాశమ్మ, రేణుక వాకిటి వెంకటేష్, కొల్లంపల్లి అంజయ్య, తిరుమలేష్, నర్సింహులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

