న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను కేంద్ర విద్యాశాఖ నియమించింది. ప్రస్తుతం సావిత్రీభాయ్ పూలే యూనివర్సిటీ వీసీగా శాంతిశ్రీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జేఎన్‌యూ వీసీగా మహిళ ప్రొఫెసర్‌ను నియమించడం ఇదే తొలిసారి. అయిదేళ్ల కాలపరిమితితో శాంతి శ్రీ నియామకం జరిగనట్లు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జేఎన్‌యూ తాత్కాలిక వీసీగా ఎం జగదీశ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గత ఏడాది అయిదేళ్ల కాలపరిమితి ముగిసింది. అయితే యూజీసీ చైర్మెన్‌ను ఆయన్ను వారం క్రితం నియమించిన విషయం తెలిసిందే.