అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై నిర్మాణ దశ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రణ్‌బీర్‌కపూర్, విక్కీకౌశల్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. యుద్ధ నేపథ్య ముక్కోణపు ప్రేమకథగా తనదైన శైలి తీవ్ర భావోద్వేగాలు, సంఘర్షణ కలబోసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.