వరంగల్చౌరస్తా, ఏప్రిల్ 17 : ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను రద్దు చేస్తున్నట్టు వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వై.మల్లేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి 2026 ఫిబ్రవరి 9న వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 15న నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పేపర్-1లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో పరీక్షను రద్దు చేశామని, ఏప్రిల్ 27న అవే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.