హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్‌కు అనుమతి విషయమై మే 28న ఈఆర్సీ బహిరంగ విచారణ జరుపనున్నది. ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో ఈ విచారణ జరుగనున్నది. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కమ్‌ను ఏర్పాటుచేస్తూ మార్చి 11న ప్రభుత్వం జీవో జారీచేసింది.
ఈ నేపథ్యంలో విద్యుత్తు పంపిణీ లైసెన్స్ కోసం రైతు డిస్కమ్ ఏప్రిల్ 17న తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి దరఖాస్తు చేసింది. ఈ లైసెన్స్‌పై ప్రజలు, వినియోగదారులు మే 18లోగా అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం ఇచ్చారు.