హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫీజు తగ్గించాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ నేతృత్వంలోని నిరుద్యోగులు శుక్రవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గతంలో టెట్ ఫీజు రద్దుచేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఒక్క పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సోమేశ్జాదవ్, వెంకట్ తదితరులు ఉన్నారు.