Public Voice | న్యాయవాదులు బాగా సంపాదిస్త్తరని చానామంది అనుకుంటరు. నిజం అట్లుండది. వందల పది మందికె మస్త్ పైసలొస్తయ్. మిగతా తొంభైమందిది పేద బతుకే. ఈ లాయర్ల పేద బతుకు గురించి ఇంతకముందు ఏలినోళ్లు పట్టించుకోలే. కేసీఆర్ వచ్చినంకనే మా బతుకు మారింది.
లాయర్ల పేదరికాన్ని అర్థం చేసుకుని, వాళ్లకు సాయం జేయాల్నని తెలంగాణ గవర్నమెంట్ మా కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసింది. లాయర్లకు హెల్త్ కార్డులు ఇచ్చిన్రు. కరోనా వచ్చినప్పుడు చానా ఇబ్బంది పడ్డ. ఆ టైమ్‌ల కోర్టులు నడువలె. ఆదాయం లేకుండె. దవాఖానల జేరితే ఉన్న డబ్బులన్నీ అయిపోయినయ్. అప్పుడు హెల్త్ కార్డు ఆదుకున్నది. నేను బతికి బయటపడ్డ. నేనే గాదు నాలాంటి లాయర్లెంతోమందికి ఈ హెల్త్ కార్డు మేలు చేసింది. ఏదన్నా పెద్ద రోగమొస్తె ఏడాది సంపాదన దవాఖానకే పోతుండె. ఇప్పుడట్ల లేదు. నలుగురు లాయర్లకు పెద్ద జబ్బు వస్తే, యాక్సిడెంట్ అయితే ఆపరేషన్‌కు కార్డు అక్కరకొచ్చింది. లాయర్లలో పేదలుంటరని, వాళ్లని పట్టించుకోవాల్నని పెద్ద మనసుతోని కేసీఆర్ దేశంలనే ఆదర్శవంతమైన పథకాన్ని ప్రవేశపెట్టిండు. మేము కృతజ్ఞతలు చెప్పుడే కాదు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– నాటకశాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్