రామాయంపేట/ మనోహరాబాద్/ నిజాంపేట/ తూప్రాన్/ చేగుంట, ఏప్రిల్ 2 : రామాయంపేట పట్టణంలోని ఉగాది వేడుకలను పట్టణవాసులు ఘనంగా నిర్వహించారు. శనివారం అయ్యప్ప ఆలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ పూజా కార్యక్రమాలు చేపట్టి, పంచాంగ పఠనం చేయించారు. మహంకాళి ఆలయంలో ట్రస్టుబోర్డు చైర్మన్ పాండురంగాచారి నేతృత్వంలో అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. పట్టణంలోని గాంధీ విగ్రహం, మార్కండేయ, సుభాష్ రోడ్, దత్తాత్రేయ, వేంకటేశ్వర స్వామి, నగరేశ్వర, శీతయ్యగుడి ప్రాంతాల్లో అర్చకులు పంచాంగ పఠనాలను చేశారు.
పండించుకున్నంత పంటలు: వేదాంతి రమేశ్బాబుశర్మ
శుభకృత్ నుంచి వచ్చే ఉగాది వరకు పాడి పంటలకు తిరుగులేదు. పచ్చటి పంట పొలాలతో రాష్ట్రం విరాజిల్లుతున్నదని ప్రముఖ వేదాం తి రమేశ్బాబుశర్మ అన్నారు. రామాయంపేట మండలం కోనాపూర్, పట్టణంలో పంచాంగ పఠనం చేశారు. వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండుతాయన్నారు. ఇనుము, భూముల రేట్లు భగ్గుమంటాయని శాస్త్రం చెబుతుందని తెలిపారు. రైతులకు మాత్రం పండించుకున్నంత పంటలకు వర్షాలు కురుస్తాయన్నారు. వ్యాపారులకు వ్యాపార లావాదేవీలు లాభసాటిగానే ఉంటాయని వివరిం చారు. పంచాంగ పఠనంలో ఎస్సై రాజేశ్, చరిత రెసిడెన్షీ నిర్వాహకులు చౌదరి సుప్రభాతరావు, శ్రీనివాసశర్మ, ప్రమోద్, జయరాములుగౌడ్, శ్యాంరాజు, యాదగిరి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పురోహితుడు రాముశర్మ పంచాంగాన్ని వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, మాజీ సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు. నిజాంపేట, నందిగామలో జాతర సందర్భంగా ఆలయం చుట్టూ ఎండ్ల బండ్ల ఊరేగింపు చేపట్టారు. నిజాంపేటలోని హనుమాన్ ఆలయంలో పురోహితుడు లక్ష్మణశాస్త్రి గ్రామస్తులకు పంచాంగ శ్రవణం చేశారు.
తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్‌లో పూజారి ఆత్రేయశర్మ, తూప్రాన్‌లో పూజారులు శలాక రాజేశ్వర్‌శర్మ, మల్కాపూర్‌లో శ్రీధర్‌శర్మ పంచాంగాన్ని చదివి వినిపించారు. షిర్డీ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించారు.
నార్సింగి మండలకేంద్రంలోని వేణుగోపాలస్వామి, భీంరావ్పల్లితోపాటు పలు గ్రామాల్లో పంచాంగ శ్రవణం చేశారు. కర్నాల్‌పల్లి గ్రామంలో ఎడ్ల బండ్ల ఊరేగింపు నిర్వహించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం
మెదక్ రూరల్/ పాపన్నపేట/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 2 : మెదక్ మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాచవరంలో రాయాలయం, మల్లికార్జున ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. మంబోజిపల్లి ,రాజ్పలి, రాయినిపల్లి, బాలానగర్, తిమ్మకపల్లి గ్రామాల్లో బోనాల పం డుగ నిర్వహించారు. మహిళలు ఒడి బియ్యం సమర్పించారు.
పాపన్నపేట మండలంలోని నార్సింగి మల్లంపేట, ఎల్లాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఎడ్ల బండ్లు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ బందోబస్తు చేపట్టారు.
పెద్దశంకరంపేటలో రామాలయం, గురుపాదగుట్ట శివాలయం, కమలాపురం హనుమాన్ ఆలయాల్లో పంచాంగ శ్రవణం చదివారు.
చిన్నశంకరంపేట మండలంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లను ఆలయాల చుట్టూ ఊరేగించారు.
ఘనంగా ఉగాది వేడుకలు..
నర్సాపూర్/ శివ్వంపేట/ చిలిపిచెడ్/వెల్దుర్తి/కొల్చారం, ఏప్రిల్2 : నర్సాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేటలో పండితులు షణ్ముఖచారి పం చాంగ శ్రవణం చేశారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో శివాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి సమక్షంలో పంచాంగ శ్రవణం చేపట్టారు.
చిలిపిచెడ్, అజ్జమర్రి, చిట్కుల్, గౌతాపూర్ గ్రామాల్లో బ్రాహ్మణులు గ్రామస్తులకు పంచాంగాన్ని వినిపించారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. కొల్చారంలో కోలాచల కృష్ణశర్మ, రంగంపేటలో నాగరాజు పంతులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు
జిల్లా కేంద్రం మెదక్‌లో ఉగాది వేడుకలు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 2 : జిల్లా కేంద్రంలో ప్రజలు ‘శుభకృత్’ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. ఏడాదంతా సుఖసంతోషాలతో ఉండడంతో పాటు ఆర్థికంగా కలిసి రావాలని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అర్చకులు పం చాంగ పఠనాన్ని వినిపించారు. పంచాంగ శ్రవణంలో మున్సిపల్ చంద్రపాల్‌తో పాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది..
ప్రాచీన శివాలయంలో బ్రహ్మశ్రీ వైద్య శ్రీనివాస్, అయ్యప్ప దేవాలయంలో వైద్య రాజుశర్మ, కొదండ రామాలయంలో రంగచారిలు పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో మెదక్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతుందని, విద్యా, వైద్య రంగాల్లో విశేషంగా అభివృద్ధి ఉంటుందన్నారు.