సంగారెడ్డి, అక్టోబర్ 30 : సమాజంలో ప్రజలకు ఉచిత న్యాయం సాయం అందేలా న్యాయసేవాధికార సంస్థలు ఉన్నాయని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లీగల్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, ఏడవ అదనపు న్యాయమూర్తి కర్ణ కుమార్‌లను ఆర్డీవో నగేశ్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సాయం అందించడానికే లీగల్ క్లినిక్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. న్యాయ సాయం గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ క్లినిక్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు అవకాశం ఉన్నదని, సమస్యల పరిష్కారానికి న్యాయ సాయం పొందవచ్చన్నారు. ప్రతి గ్రా మం, మండలంలో ఇలాంటి లీగల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి న్యాయ సాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నా రు. అనంతరం ఏడవ అదనపు న్యాయమూర్తి కర్ణకుమార్ మాట్లాడుతూ ప్రజ లు కోర్టుల చుట్టూ తిరుగకుండా, సమయాన్ని వృథా చేసుకోకుండా న్యాయ సాయం పొందవచ్చన్నారు. పేద ప్రజల కోసం ఉచిత న్యాయవాదులను నియామకం చేయడం జరుగుతుందని సూ చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, ఆర్డీవో మెంచు నగేశ్, దవాఖాన సూపరింటెండెంట్ సంగారెడ్డి, న్యాయవాదులు సమరసింహారెడ్డి, గౌతమి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బం ది, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, ప్యారి లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.