మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వి.భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరితో ముగియనున్నది. దీంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. 16న నోటిఫికేషన్ జారీ చేసి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం ఇచ్చి వచ్చే నెల 10వ తేదీన ఎన్నిక జరుపుతారు. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో మెదక్ ఎమ్మె ల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రస్తు తం మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వి.భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరితో ముగియనున్నది. ఈ నెల 16న మెదక్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. 16 నుం చి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు 23వరకు గడువు విధించింది. 24న ఎన్నికల అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10 ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 14న ఓట్లను లెక్కిస్థారు. ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌ న్సిలర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2015లో ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన వి.భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికమయ్యారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేసే అవకాశం ఉంది.