సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 6 : సంగాడ్డి జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఓటరు జాబితా (ఎలక్టోరల్ రోల్) పరిశీలకురాలు, చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్, డీఆర్వో ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు నమోదు కావాలన్నారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలిగించాలన్నారు. ఓటరు నమోదుపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించి, చైతన్య పర్చాలని సూచించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో లాజికల్ డెమోగ్రాఫిక్ లేకుండా సవరించాలన్నారు. ఆయా దరఖాస్తులు రాగానే పరిశీలించాలన్నారు.
జాబితా సవరణకు చర్యలు..
తప్పులు లేని ఓటరు జాబితా నవీకరణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హనుమంతరావు వివరించారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకంగా 18 ఏండ్లు నిండిన వారందరినీ నమోదు చేయడం, చనిపోయిన ఓటర్లను తొలిగించడంపై దృష్టి సారించామన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 30వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
నోటీసులు ఇస్తున్నారా?
సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి, పసల్వాది గ్రామా లు, అందోలు, జోగిపేట మండలాల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను ఆమె పరిశీలించారు. సంబంధిత బూత్‌ల్లో ఓటరు జాబితాలను పరిశీలించారు. ఆయా బూత్‌ల్లో ఎంతమంది ఓటర్లు నమోదు అయ్యారు.. 18 ఏండ్లు నిండిన వారు ఎంత మంది, చనిపోయిన వారిని తొలిగిస్తున్నారా? ఏ విధంగా తొలిగిస్తున్నారు? నోటీసులు ఇస్తున్నారా? నిబంధనలు పాటిస్తున్నారా? ఓటరు నమోదు, ఇతర ఫారాలు, అందుబాటులో ఉన్నాయా అనే వివరాలను ఆరా తీశారు. ఆయా బూత్ పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాలని బీఎల్వోలకు సూచించారు.
ఉమా మహేశ్వర ఆలయం సందర్శన..
పసల్వాదిలో నిర్మాణంలో ఉన్న పంచముఖ ఉమా మహేశ్వర ఆలయాన్ని శైలజా రామయ్యర్ సందర్శించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి విశిష్టతను ఆలయ వ్యవస్థాపకుడు, జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేంద్రశర్మ సిద్ధాం తి కమిషనర్‌కు వివరించారు. ఆమె వెంట డీఆర్వో రాధికా రమణి, ఆర్డీవో అంబదాస్, తహసీల్దార్ స్వామి, ఎన్నికల విభా గం సిబ్బంది ఉన్నారు.
అందోలులో పర్యటించిన కమిషనర్
అందోల్, నవంబర్ 6 : అందోలు మండలంలో ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బూత్‌లో బీఎల్వోల వద్ద ఓటరు జాబితాను ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర చేనేత, జౌళి కమిషనర్ శైలజారామయ్యర్ పరిశీలించారు.ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్నదని కమిషనర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆమె వెంట ఇన్చార్జి ఆర్డీవో అంబదాస్రాజేశ్వర్, తహసీల్దార్ అశోక్, ఇతర రెవెన్యూ అధికారులు, బూత్‌లెవల్ ఆఫీసర్లు ఉన్నారు.
తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలి
నర్సాపూర్, నవంబర్ 6 : తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు (చేనేత జౌళి శాఖ కమిషనర్) శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సాపూర్ అతిధి గృహంలో మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరామ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డితో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్వోలకు ఓట రు సాంకేతికత ఉపయోగంపై నిర్వహించిన గరుడ యాప్‌లో నర్సాపూర్ 99 శాతం ఫలితాలు సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. రాంచంద్రాపూర్‌లోని 270 పోలిం గ్ బూత్, రుస్తుంపేట్లోని 271 పోలింగ్ బూత్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరామ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి పాల్గొన్నారు.