Manish Sisodia : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెలుపల ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ మీ ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు, సత్యానికి ఉన్న శక్తి వల్లనే తాను జైలు నుంచి బయటకు వచ్చానని అన్నారు.
వీటన్నింటికీ మించి నియంతృత్వ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి నిర్బంధ చట్టాలతో విపక్ష నేతలను జైళ్లలో పెడితే దేశ రాజ్యాంగమే వారిని కాపాడుతుందనే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వప్నం ఇవాళ సాకారమైందని అన్నారు. ఈ రాజ్యాంగ శక్తే అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా జైలు నుంచి బయటకు తీసుకొస్తుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
మనీష్ సిసోడియా జైలు నుంచి బయటకు రాగానే పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ మంత్రి అతిషి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఆప్ సీనియర్ నేతలు ఆయనను ఆప్యాయంగా పలుకరించి వెలుపలకు తోడ్కొని వెళ్లారు.ఇక సర్వోన్నత న్యాయస్ధానం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ వెలువరించిన తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.
Read More :
Brutal murder | పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు