భారత్లో గెలాక్సీ ఏ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్లు లాంఛ్ చేయనున్న శాంసంగ్
శాంసంగ్ భారత్లో జనవరి ద్వితీయార్ధంలో రెండు గెలాక్సీ ఏ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనుంది. రెడ్మి నోట్ 12 సిరీస్ పేరుతో షియామి మిడ్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయడంతో శాంసంగ్ కూడా ఈ సెగ్మెంట్లో న్యూ 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ మార్కెట్లో ప్రవేశపెడుతోంది.
న్యూఢిల్లీ : శాంసంగ్ భారత్లో జనవరి ద్వితీయార్ధంలో రెండు గెలాక్సీ ఏ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనుంది. రెడ్మి నోట్ 12 సిరీస్ పేరుతో షియామి మిడ్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయడంతో శాంసంగ్ కూడా ఈ సెగ్మెంట్లో న్యూ 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఈ నెలలోనే గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ప్రవేశపెట్టనుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఏ14 5జీ ప్రారంభ ధర రూ 15,000 నుంచి మొదలవనుంది. గెలాక్సీ ఏ14 5జీ 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ+తో కూడిన ఎల్సీడీ డిస్ప్లేతో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఫోన్ వెనుకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు 2 ఎంపీ సెన్సర్లను కలిగిఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదని చెబుతున్నారు. 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 5.2, జీపీఎస్, 15డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఈ వారంలో భారత్లో లాంఛ్ అయిన రెడ్మి నోట్ 12 ఫోన్లకు శాంసంగ్ న్యూ స్మార్ట్ఫోన్లు దీటైన పోటీ ఇవ్వనున్నాయి. ఇక రెడ్మి నోట్ 12 బేస్ వేరియంట్ రూ 17,999 కాగా టాప్ వేరియంట్ రూ 19,999 పలుకుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

