Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ ను గత మార్చిలో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వీడీఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5.0 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. ఇంతకుముందు రెండు ర్యామ్ వేరియంట్లలో ఆవిష్కరించిన శాంసంగ్.. తాజాగా మరో ర్యామ్ వేరియంట్ లో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ న్యూ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999 పలుకుతుంది. ఇంతకుముందు 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ రూ.12,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. బ్యాంకు ఆఫర్ లేదా అప్ గ్రేడ్ బోనస్ కింద రూ.1000 రాయితీతో శాంసంగ్ 4జీబీ ర్యామ్ వేరియంట్ రూ.11,999, 6జీబీ ర్యామ్ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. ఈ ఫోన్ యాష్ బ్లాక్, గ్రూవీ వయోలెట్, జాజీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ల ద్వారా ఈ ఫోన్ విక్రయిస్తారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5.0 వర్షన్‌పై పని చేస్తుంది. నాలుగేండ్లు ఓఎస్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే రెండు రోజులు బ్యాటరీ లైఫ్, 25 గంటల వరకూ వీడియో ప్లే బ్యాక్ టైం ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.