ఆలేరు టౌన్, మార్చి 23 : అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జూకంటి రవీందర్ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య అధ్యక్షతన సాహిద్ దివాస్ ను పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుధీర్ దేవ్ ఉరికంభం ఎక్కిన రోజును అమరవీరుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆనాటి వీరుల త్యాగఫలమే ఈ రోజు భారతీయులుగా స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువకులు ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
అంతకుముందు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉదయం పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ పారా నంది రవికుమార్, అడ్వకేట్ శ్రీశైలం, మాజీ ఎంపిటిసి పిక్క శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, యువజన నాయకులు పూల శ్రవణ్ కుమార్, తాళ్లపల్లి మహేష్, కృష్ణ, కామిటికారి చింటూ, పూల చంద్రకుమార్, పారానంది రాహుల్ తేజ, మైదం ప్రవీణ్, ఈశ్వర్, చింతకాయల సాయి, మద్దెల రఘుపతి, వికాస్, చందు, భాను కుమార్, చందు నాయక్, రంజిత్, తిలక్, సుభాష్ యూత్, భగత్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.