Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. మదుపర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరి
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు కొనసాగుతుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఒక దశలో 2 వేల పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,500 పాయింట్ల మార్కుకు కాస్త ఎగువన ముగిసింది.
ఫలితంగా ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయి రూ.415 లక్షల కోట్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 94 మార్కు దాటి 94.01 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 73,732.58 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,532.96) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో 72,558.44 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1836.57 పాయింట్ల నష్టంతో 72,696.39 వద్ద ముగిసింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 601.85 పాయింట్ల నష్టంతో 22,512.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. టైటాన్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్, ఇండిగో స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 113.20 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం 4,272 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BSE
- Business news
- nifty
- nse
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

