రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ‘రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది. గురుకులాల్లో విద్యార్థినులకు భద్రత లేకుం డా పోయింది. విద్యాశాఖమంత్రిగా ముఖ్యమంత్రే ఉన్నా.. విద్యావ్యవస్థపై జరుగుతున్న అక్రమాలపై ఏ నాడు స్పందించలేదు.
మాజీ సీఎం కేసీఆర్పై ఉన్న అక్కసుతో తెలంగాణ బిడ్డలపై కక్షసాధిస్తున్నారు. వి ద్యార్థినులకు యూనిఫాంలు, కాస్మోటిక్ చార్జీలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా రని.. సెగ్మెంట్ చెర్లపటేల్గూడ గురుకుల పాఠశాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం సందర్శించి ప్రభుత్వంపై మండిపడ్డారు.