సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): సభ్యత్వ నమోదు కోసం పలు జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం ఇన్చార్జీలను నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శలతో సమావేశమైన ఆయన పార్టీ సభ్యత్వాన్ని డిజిటలైజేషన్ పద్ధతిలో నమోదు చేయాలని నిర్ణయించారు.
కాగా, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఇన్చార్జిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని నియమించారు. అలాగే హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేడ్చల్‌కు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.