Sabarimala | శబరిమల ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది.
Sabarimala | తిరువనంతపురం: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా ఉంది.
ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణల వల్లే వీటి వాడకాన్ని నిలిపివేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ను ఇండియన్ సెంట్రిఫ్యుజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పొందిందని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

