న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్ రహస్యంగా అణ్వస్త్ర పరీక్ష జరిపిందని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదెవ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ పరీక్షను ఇరాన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఈ సంచలన విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన సహాయకుడు దిమిత్రి ఎక్స్ పోస్టులో బయటపెట్టారు.