Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో మల్కాజ్‌గిరిలో బుల్డోజర్లతో రంగంలోకి దిగి ఫుట్‌పాత్‌పై ఉన్న చిరు వ్యాపారుల షాపులు తొలగించారని తెలిసిందే. షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో వారి షాపులను నేట మట్టం చేశారు.
ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నచిరు వ్యాపారుల పట్ల పోలీసుల పహారాలో జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కాళ్లు మొక్కుతా సార్ 5 నిమిషాలు టైం ఇవ్వండన్న ఇవ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 20, 30 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఈడ్చి పడేశారు. పొద్దున నుండి చాయ్ తాగడానికి డబ్బులు లేవు.. ఇప్పుడు మేము భిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మమ్మల్ని ఏడ్పించి వాళ్ళు ఏమీ బాగుపడుతారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది.
20 రోజుల కింద కూడా మీ షాపులకు ఫైన్ కట్టాలని రూ.5 వేలు కట్టించుకున్నారు.. అప్పుడు కూడా మా షాపులు ఇక్కడ ఉండకూడదని చెప్పలేదు. మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంది. ఉన్నట్లు ఉండి ఇలా మా షాపులు కూల్చేస్తే మేము ఇప్పుడు ఎక్కడ బ్రతకాలి.. ఏం చేయాలి. నాకు షుగర్, బీపీ ఉంది.. పొద్దున నుండి తల నొప్పిగా ఉంది. మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ నుండి వెళ్లమని స్పష్టం చేసింది.
మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం. ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడని మరో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన మహిళ వాపోయింది.
ఉన్నట్లు ఉండి ఇలా మా షాపులు కూల్చేస్తే మేము ఇప్పుడు ఎక్కడ బ్రతకాలి.. ఏం చేయాలి
మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులు తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు
20 రోజుల కింద కూడా మీ షాపులకు ఫైన్ కట్టాలని రూ.5 వేలు కట్టించుకున్నారు.. అప్పుడు కూడా మా షాపులు ఇక్కడ ఉండకూడదని… https://t.co/y20L47HgrU pic.twitter.com/7dTYawjDVg
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం
ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడు
లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల కూల్చివేత బాధితురాలి… https://t.co/e02GYvN1AC pic.twitter.com/N9hfHcfuAN
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో