నెతన్యాహు దౌత్య వైఫల్యమే ఇది!
ఇజ్రాయెల్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడం ఇజ్రాయెల్‌లో రాజకీయంగా దుమారం రేపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు.
- ట్రంప్ ఏకపక్ష సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్‌లో విమర్శలు
జెరూసలేం : ఇజ్రాయెల్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడం ఇజ్రాయెల్‌లో రాజకీయంగా దుమారం రేపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. ‘నెతన్యాహు అహంకారం, నిర్లక్ష్యం, ప్రణాళిక లేకపోవటం వల్ల ఏర్పడిన నష్టమిది. దీనిని పూడ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది’ అని విపక్ష నేత యైర్ లాపిడ్ విమర్శలు గుప్పించారు.
‘మనదేశ చరిత్రలో ఇలాంటి రాజకీయ విపత్తు ఎన్నడూ సంభవించలేదు. జాతీయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలోను ఇజ్రాయెల్‌ను లెక్కలోకి తీసుకోలేదు. ఇదంతా ప్రధాని నెతన్యాహు దౌత్య వైఫల్యం వల్లే’ అని అన్నారు. సైన్యం తన పనులన్నీ పూర్తిచేసిందని, ప్రజలు ఎంతో నిబ్బరాన్ని కనబర్చారని లాపిడ్ అన్నారు. అయితే, నెతన్యాహు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో దేనినీ సాధించలేకపోయారని ఆయన అరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

