Russia- Ukraine Conflict | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను జర్మనీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్లు ఉన్న ఈ కార్టూన్‌ను చూశారా ! ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ట్వీట్ చేసిన ఈ కార్టూన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. ఇది కేవలం మీమ్ కాదు.. మీరు, మేము చూస్తున్న వాస్తవ పరిస్థితికి ప్రతిరూపం అని పేర్కొంది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్టూన్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నిజానికి ఉక్రెయిన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు 5.28 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ గురువారం ఉదయం 10 48 గంటలకు ట్వీట్ చేసిన ఈ కార్టూన్‌కు.. ఇప్పటికే ఈ ట్వీట్‌కు 5.84లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 1.41 లక్షల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇంకా ఈ కార్టూన్‌కు స్పందన వస్తూనే ఉంది.
— Ukraine / Україна (@Ukraine) February 24, 2022