హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ (ఈడీసీ) అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలంటూ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని పలు డిపోల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు మాట్లాడుతూ.. మూడు నెలలు కావొస్తున్నా పేసేలు తప్ప ఏ ఒక అంశం కూడా పరిషారం కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగ భద్రతపై వెంటనే కమిటీ వేస్తామని, అలవెన్స్‌లు 80 శాతం పెంచుతామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు.