దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవలే కత్రినాకైఫ్‌ని కలిశారు. ‘స్పిరిట్’ సినిమాలో ఆమె చేసే క్యారెక్టర్ని వివరించారు. కత్రినాకు కూడా ఆ పాత్ర బాగా నచ్చిందనేది బాలీవుడ్ న్యూస్. ఇదిలావుంటే.. అసలు ‘స్పిరిట్’లో కత్రినా పోషించే పాత్ర ఏంటి? అనే విషయంపై బీటౌన్‌లో ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది.
ఇందులో కత్రినా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నదట. ‘స్పిరిట్’ కాప్ స్టోరీ అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ప్రభాస్ పక్కా వైల్డ్‌గా మాస్ అవతార్‌లో కనిపిస్తారట. ఆ కాంబినేషన్లోనే కత్రినా సీన్స్ వస్తాయని వినికిడి. ఇదే కనుక నిజమైతే 11ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కత్రినా కైఫ్ టాలీవుడ్లో చేసే సినిమా ఇదే అవుతుంది. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే 40శాతం పూర్తయినట్టు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవలే తెలిపారు.